అన్నమయ్య, క్రైమ్‌మిర్రర్: ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటన అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురంలో చోటు చేసుకుంది. విఠలం గ్ఉరామ సమీపంలో బస్సు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈఘటనలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా
మదనపల్లె ఆర్టీసీ డిపో బస్సు మంగళవారం ఉదయం తిరుపతికి బయలుదేరింది.
Also Read: పోలీసులమని నమ్మించి మైనర్ బాలికపై దారుణం.. ముగ్గురు యువకులపై పోక్సో కేసు
మదనపల్లె-తిరుపతి హైవే మీద ప్రయాణిస్తుండగా.. విఠలం సమీపంలో టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది ప్రయాణికులను స్థానికులు వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైనవారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రి తీసుకువెళ్లారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Also Read: యమునా ప్రక్షాళనకు బిట్టు తబాహీ శ్రీకారం.. తొలి రోజే 585 కిలోల చెత్త తొలగింపు
