Homeక్రైమ్అల్వాల్ లో దోపిడి దొంగల బీభత్సం..! ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి...

అల్వాల్ లో దోపిడి దొంగల బీభత్సం..! ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా అల‌జ‌డి…

మేడ్చల్, క్రైమ్‌మిర్ర‌ర్‌: అల్వాల్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మచ్చ బొల్లారంలోని ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డారు. బాధితుడు రమేష్ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లాడు. దాంతో దొంగలు పక్కా స్కెచ్ తో దోపిడికి పాల్పడ్డు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు.

ఇంటిగేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించి స్థానికులు రమేష్ కు సమాచారం అందించారు. దాంతో రమేష్ టాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు