క్రైమ్ మిర్రర్,వైరల్:- ప్రతీ రోజూ మనం మొబైల్ ఫోన్లలో ఉపయోగించే సిమ్ (SIM) కార్డును గమనిస్తే, దానికి ఒక మూల కట్ చేసి ఉంటుంది. అయితే, అలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది.సిమ్ కార్డును మొబైల్ ఫోన్‌లో సరైన పద్ధతిలో అమర్చడానికి (ఇన్‌సర్ట్ చేయడానికి) వీలుగానే ఆ కట్ డిజైన్‌ను తీసుకువచ్చారు. ఒకవేళ సిమ్ కార్డును తప్పు దిశలో ఫోన్‌లో పెడితే, ఫోన్‌లోని స్లాట్ లేదా సిమ్ కార్డులోని చిప్ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని నివారించడానికే ఈ డిజైన్‌ను రూపొందించారు.మొదట్లో ఎలా ఉండేదంటే..మొబైల్ ఫోన్ల వాడకం మొదలైన తొలి రోజుల్లో, సిమ్ కార్డులు దీర్ఘచతురస్రాకారంలో అన్ని వైపులా సమానంగా ఉండేవి. దీనివల్ల వినియోగదారులు సిమ్‌ను ఏ వైపు నుంచి స్లాట్‌లో వేయాలో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యేవారు. సరైన కోణంలో అమర్చక పోవడం వల్ల చాలా మంది తమ సిమ్ కార్డులను డ్యామేజ్ చేసుకునేవారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకే తయారీదారులు సిమ్ కార్డు డిజైన్‌లో ఈ చిన్న మార్పును తీసుకొచ్చారు. సిమ్ కార్డును ఎవరైనా సులభంగా గుర్తించి సరైన దిశలో ఫోన్‌లో వేసేందుకు వీలుగా ఈ కట్ చేసిన డిజైన్‌ను ప్రవేశపెట్టారు.
కావాలని నోబాల్ వేస్తే సస్పెండ్.. డొమెస్టిక్ క్రికెట్‌లో BCCI కీలక మార్పులు!
తల్లికి వందనం.. నేడే అకౌంట్లలోకి నిధులు..!