HomeసినిమాRC17: మరోసారి ముస్తాబవుతున్న రామ్ చరణ్ - కియారా అద్వానీ జోడీ?

RC17: మరోసారి ముస్తాబవుతున్న రామ్ చరణ్ – కియారా అద్వానీ జోడీ?

క్రైమ్ మిర్రర్, సినిమా:- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘RC17’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్-సుకుమార్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా కియారా పేరు వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. స్టోరీ ఫైనలైజేషన్, టెక్నికల్ టీమ్ ఎంపిక తదితర కీలక అంశాలపై ఆయన ప్రధానంగా ఫోకస్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించడం ఇది మూడోసారి అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి (బోల్తా కొట్టాయి). మరి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జోడీ రిపీట్ అయితే, సుకుమార్ దర్శకత్వంలోనైనా ఈ పెయిర్ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

  1. ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఊరుకోం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్

  2. పోలవరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం హబ్: 10 వేల ఎకరాల్లో భారీ ప్రణాళికలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు