క్రైమ్ మిర్రర్, సినిమా:- సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ధర్మన్‌పై ఆసక్తి పెరుగుతోంది. గతంలో తలైవర్173గా పిలిచిన ఈ సినిమాకు జూన్‌లో ధర్మన్ అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఓహ్ మై కడవులే ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సమర్పిస్తోంది.ధర్మన్‌లో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆసుపత్రి నేపథ్యంలో రజనీకాంత్ కనిపించగా, పోస్టర్‌కు ది డెడ్లీ డాక్టర్ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశారు. దీంతో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి దర్శకుడి విషయంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. చివరకు అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కనుంది.
శంకర్ కొత్త సినిమాతో రిస్క్ చెయ్యనున్న మరో స్టార్ హీరో!
ధర్మన్ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే 2027 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. రజనీకాంత్‌తో పాటు రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు.సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కమల్ హాసన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.మరోవైపు రజనీకాంత్ ఇప్పటికే జైలర్ 2 షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జైలర్ 2 తర్వాత ధర్మన్‌తో రజనీకాంత్ మరో విభిన్నమైన పాత్రలో కనిపించనుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
గడ్చిరోలిలో విషాదం.. పాము కాటుకు ముగ్గురు బాలికలు మృతి, మరొకరి పరిస్థితి విషమం
