Homeక్రీడలువరుస విజయాలకు అడ్డుకట్ట వేసిన రాజస్థాన్!

వరుస విజయాలకు అడ్డుకట్ట వేసిన రాజస్థాన్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) లో భాగంగా పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య బీకరమైన పోరు జరిగింది. ఐపీఎల్ సీజన్ 19 (2026) లో మొట్టమొదటి ఓటమి పంజాబ్ కింగ్స్ కు ఎదురయింది. మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 222 పరుగులు చేయగా.. అనంతరం చేజింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ జట్టుకు రాజస్థాన్ జట్టు అడ్డుకట్ట వేసింది. రాజస్థాన్ జట్టులోని ప్రతి ప్లేయర్ అద్భుతంగా రాణించడంతో రాజస్థాన్ జట్టుకు విజయం చేరువైంది. జైస్వాల్ 51, వైభవ్ 43, పరాగ్ 29, జూలై 16 రన్స్ చేయగా… ఓడిపోతుంది అని అనుకున్న సమయంలో చివరిలో శుభం మరియు ఫెరేరా ఇద్దరు కలిపి 38 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది ఆరవ విజయం. ఇక ఈరోజు ముంబై ఇండియన్స్ మరియు హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగునుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మేము మతం మారాం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు…జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు