Homeవైరల్మేము మతం మారాం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

మేము మతం మారాం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఈ రోజుల్లో మతం మారడం అనేది చాలా సులభమైన విషయంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలుగా ఒక మతంలో ఉండి ఆ మతంలో ఉన్నటువంటి ఆచారాలను పాటిస్తూ పుట్టి పెరిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ జనరేషన్ లో చాలామంది కూడా పలు మతాలకు మారిపోతూ ఉన్నటువంటి సంఘటనలను మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. మన భారతదేశంలో ప్రధానంగా హిందూ మతం జనాభా ఎక్కువ. కానీ ఈరోజు ఆ సంఖ్య అనేది రోజు రోజుకి కూడా తగ్గి పోతుంది. ఈ తరుణంలో టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మరింత వైరలవుతున్నాయి. తమ తల్లిదండ్రులు చిన్నప్పుడే మతం మారినట్లుగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మా నాన్న పుట్టుకతోనే హిందువు అని.. కానీ ఇస్లాం సిద్ధాంతాలు నచ్చడంతో 30 ఏళ్ల వయసులో ఆ మతంలోకి మారిపోయారు అని తెలిపారు. మరోవైపు మా తల్లి ముస్లిం అయినప్పటికీ హిందూ ఆచారాలు నచ్చి హిందువుగా మారినట్లు వెల్లడించారు. చివరిగా మాట్లాడుతూ.. అన్ని మతాల్లోని మంచిని స్వీకరించి.. మానవత్వంతో బతకాలి అని తన పేరెంట్స్ నాకు నేర్పించారు అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో మతం మారడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది అని.. వీటికి అడ్డుకట్ట వేయాలి అని సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నేడు తెలంగాణలో.. రేపు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల!

అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు…జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు