క్రైమ్ మిర్రర్, సినిమా:- తమిళ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త జోరు ప్రదర్శిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయన, ప్రస్తుతం తన కెరీర్లో వేగాన్ని పెంచారు. ఈ ఏడాది ఇప్పటికే ‘కరుప్పు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సూర్య, మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను విడుదల చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు.ఈ నెల 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల అవుతుంది.తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశారు.
‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్‌తో మరో ప్రాజెక్ట్:-
మలయాళంలో ‘ఆవేశం’ మూవీతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య మరొక వైవిధ్యభరితమైన చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు, ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఒకే సంవత్సరంలో ముగ్గురు వేర్వేరు దర్శకులతో వరుసగా మూడు సినిమాలు విడుదల చేస్తుండటంతో సూర్య అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు.
టీమ్ ఇండియా పేస్ భవిష్యత్తు: భువి, షమీ, బుమ్రా లోటు ఎవరు తీర్చగలరు?
కాంగోలో ఎబోలా కల్లోలం: 1,700 దాటిన మృతుల సంఖ్య, తీవ్ర ఆందోళనలో ఆఫ్రికా దేశాలు!
