Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాలకు "వర్ష గండం".. తస్మాత్ జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాలకు “వర్ష గండం”.. తస్మాత్ జాగ్రత్త!

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్:- తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి , నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల్లో రాత్రి వేళల్లో వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.రాజధాని హైదరాబాద్‌లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర సమయాలలో హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలి అని అధికారులు సూచించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండ మరోవైపు వర్షాలు దంచి కొట్టడంతో ప్రజలు ఆశ్చర్యంలో ఉండిపోతున్నారు.

పిల్లల్లో పెరుగుతున్న టైప్-1 డయాబెటిస్: రోజుకు 40 కొత్త కేసులు – లక్షణాలు, కారణాలు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

RBI గోల్డ్ లోన్స్‌పై భారీ సడలింపులు – రూ.2.5 లక్షల లోన్‌కు 85% వరకు రుణం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు