భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పుకు మార్గం సుగమమవుతోంది. కాగితం నోట్లకు బదులుగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నోట్లు మరింత దృఢంగా, సురక్షితంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రారంభ దశలో పైలట్ ప్రాజెక్ట్‌గా రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లను పరిమిత పరిమాణంలో ముద్రించనున్నారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ కొత్త నోట్లను కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి, వాటి పనితీరును పరిశీలించనున్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని విలువల నోట్లను కూడా ప్లాస్టిక్ రూపంలో అందుబాటులోకి తీసుకురావచ్చు. దీని వల్ల నోట్లు ఎక్కువకాలం మన్నే అవకాశం ఉండటంతో పాటు, నకిలీ నోట్ల సమస్యను కూడా కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి పెట్టి, అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలో కరెన్సీ రూపురేఖలు మారే అవకాశముందని చెప్పవచ్చు.
also read: ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి అరుదైన గౌరవం: ‘మిషన్ శక్తిశాట్’కు జెస్సీ ఎంపిక
