నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జెన్ జీ నిరసనలకు సంబంధించిన వీడియోలపై తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోల్లో కనిపించిన నిరసనకారుల ప్రవర్తన, వారి ఉపయోగించిన భాష తనకు తీవ్ర అసహ్యం కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు.
తన అభిప్రాయాన్ని ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించిన కంగనా, “ఇలాంటి ప్రవర్తన మన దేశ సంస్కృతి, విలువలకు విరుద్ధంగా ఉంది” అని అన్నారు. యువత తమను తాము ఎలా ప్రదర్శించుకుంటున్నారో చూసి బాధ కలుగుతోందని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా, నిరసనకారుల తీరును విమర్శిస్తూ వారు తమను తాము చిన్నచూపు చేసుకుంటున్నారని, అలాంటి ప్రవర్తన సమాజంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. కొంతమంది ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.
also read: 17 ఏళ్ల యువకుడి హత్య కేసు ఛేదించిన కలపత్తర్ పోలీసులు..
