Homeతెలంగాణఅల్లు అర్జున్‌ను హీరోగా తీసేసిన స్టార్ డైరెక్టర్.. షాకింగ్ నిజం బయటపెట్టిన టాప్ డైరెక్టర్...!

అల్లు అర్జున్‌ను హీరోగా తీసేసిన స్టార్ డైరెక్టర్.. షాకింగ్ నిజం బయటపెట్టిన టాప్ డైరెక్టర్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని ప్రముఖ రచయిత చిన్నికృష్ణ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిన్నికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి కాదని, అంతకుముందే ఒక ప్రముఖ దర్శకుడి సినిమాలో హీరోగా ఎంపికయ్యారని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఆయనను తప్పించి మరో హీరోను ఎంపిక చేశారని వెల్లడించారు. ఆ సంఘటన అల్లు అర్జున్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.

Also Read:8 నెలల గర్భిణి దారుణ హత్య.. కన్నబిడ్డల ముందే భార్యను చంపిన భర్త

ఆ దర్శకుడు తెరకెక్కించిన జయం సినిమాలో మొదట అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారని, ఆ సందర్భంగా పార్టీ కూడా ఏర్పాటు చేశారని చిన్నికృష్ణ గుర్తుచేశారు. అయితే కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోయి, ఆ ప్రాజెక్ట్‌లో హీరోగా నితిన్ పేరు ప్రకటించారని చెప్పారు. ఈ పరిణామం తనను కూడా తీవ్రంగా బాధించిందని, ఆ తర్వాత అల్లు అర్జున్‌ను హీరోగా నిలబెట్టేందుకు ప్రత్యేకంగా కృషి చేశానని వెల్లడించారు. అల్లు అర్జున్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడం అంత సులభం కాదని, తెరవెనుక చాలా సవాళ్లు ఎదురయ్యాయని చిన్నికృష్ణ తెలిపారు. ఇండస్ట్రీలో కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని, ఆ సమయంలో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే తన నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగానని వెల్లడించారు.

Also Read: కేరళలో ఘోర బస్సు ప్రమాదం – కుట్టిపురంలో అదుపుతప్పిన బస్సు బోల్తా, ఒకరి మృతి

ఇంద్ర సినిమా తర్వాత మరో పెద్ద ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ, దానిని పక్కనపెట్టి అల్లు అర్జున్ కెరీర్‌పై దృష్టి పెట్టానని చిన్నికృష్ణ పేర్కొన్నారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలు తన సినీ ప్రయాణంపై కూడా ప్రభావం చూపాయని తెలిపారు. చివరికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆర్య, దేశముదురు, రేసుగుర్రం, అల వైకుంఠపురంలో, పుష్ప వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. ఇండస్ట్రీలో తన ప్రయాణంలో ఎదురైన సంఘటనలన్నింటినీ ఒక పుస్తకంగా రాశానని చిన్నికృష్ణ తెలిపారు. ఆ పుస్తకంలో అప్పటి పరిస్థితులు, జరిగిన పరిణామాలు, సంబంధిత వ్యక్తుల వివరాలను కూడా ప్రస్తావించానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు