క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :-ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన సంక్షేమ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి కొత్త ఆశలను తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ తీర్పు కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, ఒక తరం భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.ప్రజలు పైకి మౌనంగా ఉన్నప్పటికీ, తమ ఓటు హక్కు ద్వారా చరిత్రను మార్చగలరని, ఈ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని నిరూపించాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించామని ఆయన గుర్తుచేశారు.అంతేకాకుండా, తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండు రోజులు పూర్తి చేసుకోగా ఇప్పటివరకు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామని తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.
లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ పార్టీలో చేరేందుకు నిర్ణయం!!
తెలుగు రాష్ట్రాలకు “వర్ష గండం”.. తస్మాత్ జాగ్రత్త!