-
వివిధ దశల్లో పనిచేసేందుకు 36వేల మందికి పైగా సిద్ధం
-
దరఖాస్తులు స్వీకరించి.. వారి అర్హతకు అనుగుణంగా పదవులు
క్రైమ్ మిర్రర్,, ఏపీ బ్యూరో: ఏపీలో పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ సమస్త గత నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించారు. సుదీర్ఘకాలం ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించేందుకు వీలుగా పార్టీని రూపొందించే పనిలో పడ్డారు. అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై ఆయన దృష్టి సారించారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన శత శాతం స్థానాలను సొంతం చేసుకుంది. అయినా సరే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా బలంగా ఎదిగేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నాలు అంటూ లేవు. అయితే పార్టీ అంటే సంస్థాగతంగా బలంగా ఉండాలని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.
దరఖాస్తుల స్వీకరణ…
Also Read:లక్ష్మీతండాలో దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీర మహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఏకంగా 36 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను, అభ్యర్థుల అర్హతలను పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తుండడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంసంగా మారింది. పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు 25 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులు, స్థానిక నేతలు, సభ్యత్వ నమోదు సాదక్ లతో కూడిన 28 మంది సభ్యుల జంబో కమిటీలను నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా జండా మోసి, కష్టకాలంలో పార్టీ వెన్నంటి నడిచిన అసలైన వీర మహిళలు, సాధకులను గుర్తించి వారి వివరాలను, నివేదికలను సహకరించడమే ఈ కమిటీల ప్రధాన బాధ్యత.
లోతైన రాజకీయ వ్యూహం…
Also Read: తక్కువ ధరకే బంగారం అంటూ మోసం – కడపలో నకిలీ గోల్డ్ ముఠా బట్టబయలు
లోతైన రాజకీయ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రక్రియ చేపడుతున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకే పరిమితం అవుతాయి. సంస్థాగత నిర్మాణాన్ని విస్మరిస్తుంటాయి. గతంలో పసలేని కమిటీలు, సరైన నిర్మాణం లేకపోవడం వల్ల ఎదురైన వైఫల్యాలను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తల్లో అసంతృప్తి చెలరేగకుండా, వారికి పార్టీ, అనుబంధ పదవుల్లో తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్మించడమే పవన్ కళ్యాణ్ ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది.. అవకాశవాద నేతల చొరబాటు జనసేనలోకి లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది
