-
కోడలు ఫిర్యాదుతో 11 మందిపై కేసు
-
కుమారుడు, భార్యతో సహా అందరిపై గృహహింస, హత్యాయత్నం సెక్షన్లు
-
చిక్కుల్లో మాజీమంత్రి ఫ్యామిలీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసులతో ఉక్కు పాదం మోపగా.. ఇప్పుడు వ్యక్తిగత అంశాల్లో సైతం ఒక్కో నేత కేసుల బారిన పడుతున్నారు. జైలుకు వెళ్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. వారిపై గృహహింసకేసు నమోదయింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని.. మోసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేఘన ఫిర్యాదుతో.. జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, రాజీవ్ తో సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏడాది కిందట వివాహం…
Also Read: తక్కువ ధరకే బంగారం అంటూ మోసం – కడపలో నకిలీ గోల్డ్ ముఠా బట్టబయలు
జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ కు తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనతో 2025 మే 28న వివాహమయింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే తనకు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అంటూ మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేఘన తన ఫిర్యాదులు భర్త రాజీవ్ తో పాటు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, మరిది రోహిత్, ఆడపడుచు ప్రియాంక, జోగి రమేష్ సోదరుడు రాము, ఆయన కుమారులు రాజేష్ పండు.. రమేష్ బావమరిది స్వామి, ఆయన భార్య రమ, కుమారుడు సంతోష్ పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు…
Also Read:లక్ష్మీతండాలో దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
జోగి రమేష్ కోడలు మేఘన ఒక్కసారిగా ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేసారని మేఘన తన ఫిర్యాదులో ఆరోపించారు. తనను చంపేందుకు హత్యా ప్రయత్నం చేశారని కూడా పేర్కొన్నారు. ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు వివరించారు. పోలీసులు వారిపై మోసం, హత్యాయత్నం, వరకట్న వేధింపులు, గృహహింస తదితర కేసులు బుక్ చేశారు.
వరుసగా కేసులు…
Also Read:రాజ్-డీకే కొత్త లేడీ ఓరియెంటెడ్ మూవీ.. నేషనల్ క్రష్తో మరో భారీ ప్రాజెక్ట్?
ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి ఫ్యామిలీ చిక్కుకుంది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టయ్యారు కూడా. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఇంతలోనే భార్యను హింసించిన కేసు నమోదయింది. అయితే కుటుంబ వ్యవహారాన్ని పరిష్కరించడంలో జోగి రమేష్ విఫలమయ్యారు. కుటుంబ వ్యవహారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకోవడం, అరెస్టులకు గురికావడం సంచలనంగా మారుతోంది.
