HomeతెలంగాణRain Alert: నేడు భారీ వ‌ర్షాలు...!

Rain Alert: నేడు భారీ వ‌ర్షాలు…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ర్ట‌వ్యాప్తంగా నైరుతి రుతుప‌నాలు చురుగ్గా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read:ఇంగ్లండ్‌తో తొలి టీ20కి వర్షం ముప్పు: వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశేనా?

జూలై 3న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. పలుచోట్ల గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించింది.అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, నాలాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ఐఎండీ సూచించింది.

Also Read:జాగ్రత్త సుమీ… మనసును చదివేస్తున్న ఏఐ- టెక్నాలజీ ప్రపంచంలో కొత్త సంచలనం!

తాజావార్తలు