Homeసినిమా‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి మాస్ అవతార్.. రాహుల్ రామకృష్ణ కామెంట్స్‌కు ఫన్నీ రిప్లై

‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి మాస్ అవతార్.. రాహుల్ రామకృష్ణ కామెంట్స్‌కు ఫన్నీ రిప్లై

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో పలువురు నటీనటులు తమ పాత్రలతో మెప్పిస్తుండగా.. నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ, విభిన్న పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ పొలిటికల్ లీడర్‌గా కనిపించారు. ముఖ్యంగా ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గుర్తు చేసేలా కొన్ని సన్నివేశాల్లో ప్రియదర్శి కనిపించడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ప్రియదర్శి నటనపై నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రియదర్శిని అభినందిస్తూ.. కేసీఆర్‌ను ఉద్దేశించేలా ‘ప్రియదర్శి బాపూ (కేసీఆర్).. ఇచ్చి పడేశినావు’ అంటూ ప్రశంసించారు.

రాహుల్ రామకృష్ణ కామెంట్‌కు ప్రియదర్శి కూడా తనదైన హాస్య శైలిలో స్పందించారు. కేసీఆర్ గతంలో ప్రెస్‌మీట్ సందర్భంగా మాట్లాడిన తీరును గుర్తు చేసేలా సరదాగా రిప్లై ఇచ్చారు. “ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కోసి దావత్ ఇయ్యాలే” అంటూ ఫన్నీగా స్పందించారు.

ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు నటుల మధ్య జరిగిన ఈ కామెడీ ఎక్స్చేంజ్‌పై అభిమానులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరోవైపు ‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్రపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

also read: కొడుకు మరణించినా కోడలికి అండగా నిలిచింది.. మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితం అందించింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు