సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లుగా గడ్డంతో కూడిన రఫ్ లుక్‌లో కనిపించిన మహేశ్.. తాజాగా క్లీన్ షేవ్‌తో దర్శనమివ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొత్త లుక్‌లో ఆయన మరింత యంగ్‌గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ షూటింగ్లో భాగంగా కాశీ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. అక్కడ ఆయనను అభిమానులు, ఫొటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించగా.. ఆ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎయిర్‌పోర్టులో మహేశ్ చాలా ఉత్సాహంగా కనిపించారు. తనను ఫొటోలు తీస్తున్న కెమెరాలను గమనించిన ఆయన నవ్వుతూ తన గడ్డం వైపు చూపించారు. గడ్డం తీసేశానన్నట్టుగా చేసిన ఆ సరదా సైగలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
మహేశ్ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్.. ఆయన వయసు 51 ఏళ్లు అయినప్పటికీ ఇంకా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ‘అతడు’, ‘ఒక్కడు’ వంటి సినిమాల సమయంలో కనిపించిన యంగ్ మహేశ్ లుక్‌ను గుర్తు చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత క్లీన్ షేవ్‌లో కనిపించడంతో పాత రోజుల మహేశ్ మళ్లీ కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు లుక్‌లో వచ్చిన ఈ మార్పు వెనుక ‘వారణాసి’ సినిమా కారణమై ఉండొచ్చనే చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం ఆయన గత కొంతకాలంగా ప్రత్యేకమైన గెటప్‌ను మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో మహేశ్ పాత్రకు సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
‘వారణాసి’లో మహేశ్ రుద్ర అనే ట్రావెలర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. అలాగే శ్రీరాముడికి సంబంధించిన మరో కోణంలోనూ ఆయన పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో సుమారు 15 నిమిషాల నిడివి ఉండే కీలకమైన ఎపిసోడ్లో మహేశ్‌ను 24 ఏళ్ల యువకుడిగా చూపించనున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
అయితే ఆ యువకుడి పాత్ర కోసం మహేశ్ క్లీన్ షేవ్ చేసుకున్నారా? లేక కాశీ షెడ్యూల్ పూర్తవడంతో కొంత విరామం తీసుకుంటూ తన లుక్‌ను మార్చుకున్నారా? అనే విషయం మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఏదేమైనా మహేశ్ బాబు కొత్త లుక్ మాత్రం అభిమానులకు ఫుల్ ట్రీట్‌గా మారింది. ఈ మార్పు వెనుక అసలు కారణం ఏమిటో తెలియాలంటే ‘వారణాసి’ చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
also read: ‘ది ప్యారడైజ్’లో ప్రియదర్శి మాస్ అవతార్.. రాహుల్ రామకృష్ణ కామెంట్స్‌కు ఫన్నీ రిప్లై
