Homeజాతీయంతెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాక్ష‌లు తెలిపిన పీఎం మోడీ...! తెలంగాణ అభివృద్దికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉందంటూ ట్వీట్‌...

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాక్ష‌లు తెలిపిన పీఎం మోడీ…! తెలంగాణ అభివృద్దికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉందంటూ ట్వీట్‌…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ రాష్ర్టం ఆవిర్బావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని పీఎం న‌రేంద్ర‌మోడీ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం గొప్పదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార నైపుణ్యానికి ప్రసిద్ధి చెందినవారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ రాష్ట్రం ధైర్యానికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్రను, వైభవమైన సంస్కృతిని కలిగి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ నూతన ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారని అన్నారు. ఈ రాష్ట్రం తన అద్భుతమైన సంస్కృతి, చరిత్రకు పేరుగాంచిందని… అది ధైర్యం, సంకల్పంతో కూడినదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు