చిత్తూరు జిల్లా, క్రైమ్మిర్రర్: వి.కోట మండలంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నుమానంతో ఓ తల్లి తన ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. వి.కోట ఈశ్వర్ నగర్లో ఇళ్ళు అద్దెకు ఉంటున్న ఇంద్రజ భర్త మరణించగా, అనంతరం ఎర్రంపల్లి చెందిన రాజుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. తమ సంబంధానికి కుమారుడు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఇంద్రజ, తన ప్రియుడు రాజుతో కలిసి బాలుడిపై దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read:ప్రేమ పేరుతో వేధింపులు..బస్సు ఎక్కిన యువతిని వెంటాడి దాడి
బాలుడి శరీరంపై, మర్మంగం వద్ద బ్లేడుతో గాయపరిచి, అనంతరం విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాచారం దుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేయగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:విషాదం.. ఇద్దరు పిల్లలను సంపులో తోసి తల్లి ఆత్మహత్య