Homeక్రైమ్నా పెండ్లి జ‌రిపించండి సారూ... కుటుంబ స‌భ్యుల‌పై మ‌హిళ ఫిర్యాదు...!

నా పెండ్లి జ‌రిపించండి సారూ… కుటుంబ స‌భ్యుల‌పై మ‌హిళ ఫిర్యాదు…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ : నా పెళ్లి పెండ్లి జ‌రిపించంటూ సారూ అంటూ పోలీసు స్టేష‌న్‌లో కుటుంబ స‌భ్యుల‌పై ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పెండ్లి చేసుకోవటంలో తనకు సాయం చేయాలంటూ 41 ఏండ్ల మహిళ పోలీసులను కోరింది. అన్నావదినలు తన పెండ్లి గురించి పట్టించుకోవటం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ఆధారంగా.. జిల్లాలోని ‘సరాయ్‌ ఇనాయత్‌’ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. సదరు మహిళ కోసం వస్తున్న పెండ్లి సంబంధాల్ని కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నట్టు తెలిసింది.

తన పెండ్లి జరగకుండా కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని సదరు మహిళ పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తన కోసం వస్తున్న ప్రతి పెండ్లి సంబంధాన్ని అన్నా వదినలు తిరస్కరిస్తున్నారని ఆరోపించింది. కాబట్టి తన పెండ్లికి కుటుంబ సభ్యులు అడ్డంకులు సృష్టించకుండా చూడాలంటూ పోలీసులను కోరింది. కాగా, ఆమె ఆరోపణల్ని కుటుంబసభ్యులు తోసిపుచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు