అంతర్జాతీయంక్రీడలు
Trending

పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసిన అభిమానులు!… ఉత్కంఠంగా సాగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ అభిమానులు కొన్ని పనులు చేయొద్దు అంటూ హెచ్చరించారు. భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కోహ్లీ, రోహిత్ శర్మ తో పాటుగా భారత్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరిని కూడా హగ్ చేసుకోవద్దని పాకిస్తాన్ క్రికెటర్లకు అభిమానులు పెద్ద ఎత్తున సందేశాలు పంపినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.

ప్రశ్నించడం మానేసి… గుళ్ళు, గోపురాలు తిరుగుతావ్ ఏంటి పవన్ : సిపిఐ

కాగా భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల మధ్య కూడా తీవ్రమైన ఉత్కంఠత నెలకొంటుంది. నువ్వా…. నేనా… అంటూ ఇరుజట్లు కూడా తలపడతాయి. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ప్రపంచ దేశాలలోని ప్రజలందరూ కూడా టీవీ ముందు అతుక్కుపోతారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అభిమానులు ఆ దేశ క్రికెట్ ప్లేయర్స్ కు ఇలాంటి సందేశాలను పంపడంతో భారతదేశ క్రికెట్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. భారతదేశానికి…. పాకిస్తాన్ కి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ భారత్ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తా నాటకాలు ఏ విధంగా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది. దీంతో ఈనెల 23వ తారీఖున జరగబోయే మ్యాచ్ తల ఉత్కంఠంగా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మా కాలనీకి “పాకిస్తాన్” పేరు వద్దంటూ ఆందోళన!

అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button