Homeజాతీయంప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. రంగంలోకి దిగిన పోలీసులు, ఎఫ్ఐఆర్‌ల నమోదు!

ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. రంగంలోకి దిగిన పోలీసులు, ఎఫ్ఐఆర్‌ల నమోదు!

క్రైమ్ మిర్రర్,న్యూఢిల్లీ:- సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత, అభ్యంతరకర పోస్టులు చేసిన వారిపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రధాని ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆయా ఖాతాలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.అబ్యూసివ్ కంటెంట్ పోస్ట్ చేసిన యూజర్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ‘ఎక్స్’ (ట్విట్టర్) తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రధాని వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేయడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.సమాచారం అందించిన 3 గంటల్లోగా సంబంధిత యూజర్ల డేటాను భద్రపరిచి, ఆ అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

రేషన్ కార్డుల ఈ-కేవైసీకి రేపటితో ముగియనున్న గడువు: పొడిగింపుపై ఉత్కంఠ!

పశ్చిమ బెంగాల్‌లో మాజీ డ్రైవర్ ఇంట్లో భారీ నగదు, బంగారం పట్టివేత.. రూ.28 కోట్లు వెలుగులోకి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు