క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసి ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అయితే, ఇంకా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని తెలుస్తోంది. ఈ-కేవైసీ చేసుకోని వారి జాబితాలు ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకున్నాయి.గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయబడుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఇంకా ప్రక్రియను పూర్తి చేయని లబ్ధిదారులు వెంటనే తమ సమీపంలోని మీసేవ లేదా రేషన్ షాపులను సంప్రదించి ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు.అయితే, ఇంకా చాలా మంది ఈ-కేవైసీ పూర్తి చేయని దృష్ట్యా, ప్రభుత్వం ఈ గడువును మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందా లేదా అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియడం లేదు. గడువు పొడిగింపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
పంజాబ్ పేపర్ లీక్ వివాదం: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన
