క్రైమ్ మిర్రర్,జాతీయం:- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో భారతదేశంలోని వ్యవసాయేతర రంగాలలో 8 నుంచి 12 శాతం ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా జనరేటివ్ AI టెక్నాలజీ ఈ మార్పులకు ప్రధాన కారణంగా నిలవనుందని తెలిపింది.అయితే, AI రాకతో పూర్తిగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన అవసరం లేదని నివేదిక స్పష్టం చేసింది. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మీడియా, ఫైనాన్షియల్ వంటి రంగాల్లో పనిచేస్తున్న దాదాపు 42 నుంచి 48 శాతం మంది ఉద్యోగులకు జనరేటివ్ AI వల్ల పనులు సులభతరం అవుతాయని, వారి ఉత్పాదకత పెరుగుతుందని వివరించింది.మరోవైపు, టెలికాం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ వంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక హెచ్చరించింది. ఆటోమేషన్‌కు అనుకూలంగా ఉండే రొటీన్ పనులను AI సులభంగా భర్తీ చేయగలగడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
రేషన్ కార్డుల ఈ-కేవైసీకి రేపటితో ముగియనున్న గడువు: పొడిగింపుపై ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్‌లో మాజీ డ్రైవర్ ఇంట్లో భారీ నగదు, బంగారం పట్టివేత.. రూ.28 కోట్లు వెలుగులోకి!
