మేఘాలయలో సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తాజా పరిణామంగా మారింది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, తాను పూర్తిగా అమాయకురాలని పేర్కొంటూ ఆమె కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ కేసులో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, సోనమ్‌ను తిరిగి జైలుకు పంపాలన్న ప్రభుత్వ వాదనను ఈ దశలో తిరస్కరించింది.
విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ఆరోపణలు కోర్టు విచారణలోనే నిరూపితమవ్వాలని, నేరం నిరూపితమయ్యే వరకు ప్రతి వ్యక్తిని అమాయకుడిగానే పరిగణించాలనే సూత్రాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇప్పటికీ కేసు విచారణ కొనసాగుతుండగా, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read: ఉచిత పథకాలకు కోర్టు బ్రేక్…! పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం….