కర్పూలు, క్రైమ్‌మిర్రర్: నంద్యాల జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భూకబ్జా ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి.. ఏకంగా రూ.15 కోట్ల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కాటసాని రామిరెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాటి అధికార మదంతో ప్రభుత్వ ఆస్తులను సైతం వదలకుండా కాటసాని అనుచరులు కబ్జాకు పాల్పడ్డారనే విమర్శలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.ఈ భారీ భూకబ్జా పర్వంలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా.. ప్రభుత్వానికి రక్షణగా ఉండాల్సిన అధికారులే లంచాలకు ఆశపడి చేతులు కలిపినట్లు తెలుస్తోంది.
Also Read:ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
అప్పట్లో కాటసాని రామిరెడ్డి అక్రమాలకు ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలకు చెందిన కొందరు కీలక అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా రికార్డులను తారుమారు చేయడం లేదా కబ్జా జరుగుతున్నా కళ్లు మూసుకోవడం ద్వారా ఈ అక్రమ ఆక్రమణకు వారు బాటలు వేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కాటసాని రామిరెడ్డి చేసిన ఈ భూకబ్జా వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ జరపగా.. సదరు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కాటసాని ఆక్రమించిన మాట వాస్తవమేనని తేల్చేశారు.
Also Read:తెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!
విజిలెన్స్ నివేదికతో కాటసాని అక్రమాలు అధికారికంగా బట్టబయలయ్యాయి. విజిలెన్స్ విచారణలో ఆక్రమణలు నిజమేనని తేలడంతో ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. భూకబ్జాకు పాల్పడ్డ వైసీపీ నేత కాటసాని రామిరెడ్డిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. అప్పట్లో ఆయనకు అండగా నిలిచి లూటీకి సహకరించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై కూడా శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.