HomeతెలంగాణGOOD NEWS: రేషన్ కార్డు దారులకు కొత్త సదుపాయం...!

GOOD NEWS: రేషన్ కార్డు దారులకు కొత్త సదుపాయం…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 2026 నాటికి రేషన్ కార్డుదారులకు శుభవార్త చెపుతూ వారికీ సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో పోషకాహార విలువలను పెంచేందుకు ఇప్పటివరకు ఇస్తున్న బియ్యంతో పాటు ఇకపై జొన్నలు (Sorghum) మరియు మొక్కజొన్నలను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

రైతుల నుంచి మార్క్‌ఫెడ్ (MARKFED) ద్వారా సేకరించిన ఈ ధాన్యాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం వల్ల పేదవారి ఆకలి తీరడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఉగాది (2025) నుంచి అమల్లోకి వచ్చిన పథకం ప్రకారం, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.

కొన్ని రకాల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర మరియు గోధుమలను కూడా రాయితీ ధరలకు లేదా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాలతో పాటు ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కూడా విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారంగా జొన్నలను అందించాలని అధికారులను ఆదేశించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు