ముంబై, క్రైమ్ మిర్రర్: హారాష్ర్ట రాజకీయాల్లో పెను సంచలనం. సునేత్రా పవార్ అనే నాయకురాలు భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో 2,18,034 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రికార్డు గెలుపు…!
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనది. ఈ పార్టీకి చెందిన ప్రముఖ నేత అజిత్ పవార్ మరణం తర్వాత ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో సునేత్రా పవార్ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల మద్దతుతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. ఇంత పెద్ద మెజజార్టీతో గెలవడం చాలా అరుదు. ఇప్పటివరకు దేశంలో అత్యధిక మెజార్టీ రికార్డు సునీల్ కుమార్ శర్మ పేరిట ఉండేది. ఆయన సాహిబాబాద్ నుంచి 2.14 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆ రికార్డును సునేత్రా పవార్ బ్రేక్ చేశారు.
ఈ విజయం కేవలం ఒక ఎన్నిక గెలుపు మాత్రమే కాదు, ప్రజలు చూపించిన నమ్మకానికి నిదర్శనం. సునేత్రా పవార్ కుటుంబానికి, ముఖ్యంగా పవార్ కుటుంబ రాజకీయ వారసత్వానికి ఇది పెద్ద గౌరవం తీసుకువచ్చింది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ భారీ మెజార్టీ భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అభివృద్ధి, నాయకత్వంపై విశ్వాసం ఉంచి ఓటు వేసినట్లు కనిపిస్తోంది