Homeసినిమానాగబంధం ట్రైలర్.. విజువల్స్‌తో, సోషియో ఫాంటసీలో కొత్త ప్రపంచం చూపించిన మేకర్స్!

నాగబంధం ట్రైలర్.. విజువల్స్‌తో, సోషియో ఫాంటసీలో కొత్త ప్రపంచం చూపించిన మేకర్స్!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారీ అంచనాల మధ్య విడుదలైన నాగబంధం ట్రైలర్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. సుమారు మూడు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, సెట్స్, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. తెలుగు సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే సోషియో-ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం బ్రహ్మకమలం అనే దివ్య పుష్పం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అనంత పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన ఈ రహస్యమైన పుష్పం కోసం జరిగే పోరాటమే కథకు ప్రధాన కేంద్రబిందువుగా కనిపిస్తోంది. అపార శక్తులు కలిగిన ఈ బ్రహ్మకమలాన్ని దక్కించుకోవాలని ప్రతినాయక శక్తులు ప్రయత్నిస్తుంటే, దానిని రక్షించేందుకు హీరో రంగంలోకి దిగినట్లు ట్రైలర్‌లో చూపించారు.

విరాట్ కర్ణ చెప్పిన డైలాగ్స్ కథలోని సాహసయాత్రను సూచిస్తున్నాయి. మరోవైపు ధర్మాన్ని కాపాడేందుకు దివ్య శక్తులు రంగప్రవేశం చేయడం, నాగ సాధువుల పాత్రలు, ఆలయ రహస్యాలు కథలో కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా భారీ నాగుపాములు, పురాతన దేవాలయాలు, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉన్నాయి. ట్రైలర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత గ్రాండియర్‌గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఫాంటసీ ప్రపంచాన్ని సజీవంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కథ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే నాగబంధం విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు