హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవల బయటకొచ్చిన ఈ క్రేజీ న్యూస్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగించింది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ కాంబో మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాతో మరో తెలుగమ్మాయి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.
Also Read:కట్ల పాము కనిపిస్తే పట్టుకుని పరాచకాలాడాడు.. కట్ చేస్తే, నిమిషాల్లోనే!!
ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. ప్రియదర్శి, నాగదుర్గ పెయిర్ ప్రేక్షకులకు కొత్తదనం పంచనుంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమాను యువ దర్శకుడు వంశీ రెడ్డి రూపొందించనున్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read:విశ్వనాథ్ & సన్స్’ మూవీ తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’ విడుదల…!