Homeట్రావెల్పాములపహాడ్ గ్రామా విద్యార్థినులకు ఎమ్మెల్యే అభినందనలు..!

పాములపహాడ్ గ్రామా విద్యార్థినులకు ఎమ్మెల్యే అభినందనలు..!

  • 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన రాజకుమారి,యామిని

  • పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కారం

  • విద్యార్థినుల విజయాన్ని అందరూ అభినందించారు..

క్రైమ్ మిర్రర్,మిర్యాలగూడ: నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు యామిని, పేరబోయిన రాజకుమారి 2026లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (బీఎల్‌ఆర్) ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారికీ అభినందన పత్రాలను అందజేశారు. సందర్బంగా వారి ఉన్నత విద్య కోసం ప్రొసహకంగా ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, విద్యే విజయానికి మార్గమని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థినుల విజయాన్ని అందరూ అభినందించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు