Homeతెలంగాణక్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

క్రైమ్ మిర్రర్ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్ ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొచ్చే విషయములో కీలక పాత్ర పోషిస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) కొనియాడారు..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్” 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు.

“క్రైమ్ మిర్రర్ న్యూస్ పేపర్” ఇదే ధోరణితో ముందుకెళ్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

1 COMMENT

Comments are closed.

తాజావార్తలు