Homeతెలంగాణజీవిత భీమాలో ఉత్తమ సర్వీస్..100 పాలసీలు పూర్తి

జీవిత భీమాలో ఉత్తమ సర్వీస్..100 పాలసీలు పూర్తి

  • జీవిత భీమాలో ఉత్తమ సర్వీస్..
  • 100 పాలసీలు పూర్తి చేసిన ముక్కెర శ్రీశైలం..
  • అభినంధించిన ఎల్ఐసి అధికారులు.. శాలువాతో సన్మానం..

మాడ్గుల (క్రైమ్ మిర్రర్):- ఎల్ఐసి జీవిత భీమా సంస్థ ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. కుటుంబ పెద్దగా భారం మోసే ఎల్ఐసి భారత దేశంలో అగ్రగామిగా నిలిచిన విషయం అందరికి తెలిసినదే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని, దేవరకొండ బ్రాంచ్ ఏజెంట్ ముక్కెర శ్రీశైలం, అద్భుత సేవలను అందించారు..

ఈ ఆర్థిక సంవత్సరంలో ముందుగా 100 పాలసీలను పూర్తి చేసి, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. జీవిత భీమా గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరుస్తూ, శ్రీశైలం ఈ ఘనతను సాదించారు. ఈ సందర్బంగా మాల్ షాటిలైట్ కార్యాలయంలో, ఎల్ఐసి అధికారులు శ్రీశైలంను అభినందిస్తూ సన్మానించారు..

ఈ కార్యక్రమంలో మాల్ బ్రాంచ్ మేనేజర్ శివ కృష్ణ, డివో ధనుంజనేయులు, శ్రీనివాస్ రావు, సత్తయ్య, ఏజెంట్ లు బోనగిరి పురుషోత్తం, తోట వెంకటేశ్వర్లు, గనేటి ఈశ్వరయ్య, ఈడేం యాదగిరి, తేలకుంట శ్రీశైలం, జాజాల శంకర్, యంజాల అనిల్, పగడాల జానకి తదితరులు పాల్గొన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు