Homeతెలంగాణతిమ్మాపురం గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య అధికారిణి

తిమ్మాపురం గ్రామంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్య అధికారిణి

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం రోజున గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి డాక్టర్ అమరావతి ప్రజలకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ)రాకేష్ సింగ్, ఏఎన్ఎం జయలక్ష్మి, ఆశాకార్యకర్త ఆర్ రజిత, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ జనరంజన్, అంగన్వాడీ టీచర్ బి వైష్ణవి, ఏఫ్ఏ ఎన్ రవిందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం వైద్య అధికారిణి ప్రజలకు ఆరోగ్యం గురించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

బార్ కౌన్సిల్ పోరులో రాపోలు అభినవ్.

ప్రజల మధ్యకు మంత్రి.. వార్డుల్లో పర్యటన..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు