Homeక్రీడలుKavya Maran Wedding: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కావ్యా పాప.. వరుడు ఎవరంటే?

Kavya Maran Wedding: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కావ్యా పాప.. వరుడు ఎవరంటే?

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) సీఈవో కావ్య మారన్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వార్త మరోసారి వైరల్‌గా మారింది.

అనిరుధ్‌ బంధువు, సీనియర్‌ నటుడు వై.జీ. మహేంద్రన్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఆయన మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు కావ్య మారన్‌, అనిరుధ్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపారు. అలాగే, కావ్య మారన్‌పై ప్రశంసలు కురిపించారు. అంత పెద్ద ఐపీఎల్‌ జట్టును సమర్థంగా నిర్వహించే సామర్థ్యం ఆమెకు ఉందని, తండ్రి కళానిధి మారన్‌ వ్యాపార నైపుణ్యాలు ఆమెకు వచ్చాయని పేర్కొన్నారు. ఇద్దరూ మంచి జోడీ అని, భవిష్యత్తులో కలిసి మ్యూజిక్‌ బిజినెస్‌లో కూడా రాణించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో కావ్య-అనిరుధ్‌ పెళ్లి వార్తలు మళ్లీ ట్రెండింగ్‌గా మారాయి. అయితే గతంలో తమ ప్రేమ, పెళ్లి వార్తలను అనిరుధ్‌ ఖండించాడు. ఇప్పటి వరకు ఈ తాజా ప్రచారంపై కావ్య మారన్‌ లేదా అనిరుధ్‌ అధికారికంగా స్పందించలేదు.

ఇక అనిరుధ్‌ రవిచందర్‌ ‘వై దిస్‌ కొలవెరి డీ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. ‘జైలర్‌’, ‘జవాన్‌’, ‘లియో’, ‘జెర్సీ’ వంటి సినిమాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు కావ్య మారన్‌ ప్రముఖ వ్యాపారవేత్త, సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌ కుమార్తె. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సమయంలో తన హావభావాలు, జట్టు పట్ల చూపించే భావోద్వేగాలతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కావ్య-అనిరుధ్‌ పెళ్లి వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు