హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కౌంటరిచ్చారు. రాజధాని కట్టుకునే చేతకాదు కానీ, తెలంగాణలో నవనిర్మాణం చేస్తారా అని నిలదీసారు. రాష్ట్రం విడిపోయింది.. కానీ, ప్రజలు విడిపోలే.. ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దు. లేనిపోని పెత్తనాలు చేయాలనుకుంటే ఊరుకునేది ఉండదని ఆమె హెచ్చరించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . ఏపీ రాజకీయ నాయకులకు ఏజెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ నాయకుల్లో భయం ఉండేది. ఇప్పుడు హద్దులు మీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విగ్రహాలు కూల్చి ఏపీకి పార్శిల్ చేస్తాం. రావచ్చు.. పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగ్ లు చేసుకుని పోవచ్చు. సెక్రటేరియట్ లో ఏపీ నేతలు చక్రం తిప్పుతామంటే ఊరుకోమని అన్నారు.