Homeక్రైమ్మ‌హావీర్ ఆసుప‌త్రిల్లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి...! కుటుంబీకుల ఆందోళ‌న‌...

మ‌హావీర్ ఆసుప‌త్రిల్లో చికిత్స పొందుతూ చిన్నారి మృతి…! కుటుంబీకుల ఆందోళ‌న‌…

వికారాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మహావీర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఐదు నెలల పసిబిడ్డ మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. నవాబ్పేట్ మండలం మినాపల్లి గ్రామానికి చెందిన జోగు మధుకర్, మౌనిక దంపతుల ఐదు నెలల పసిబిడ్డ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పసిబిడ్డ మృతితో ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు