ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం తాజాగా హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వ్యవసాయ రంగంలో పురుగుమందుల అధిక వినియోగం, వాటిలోని హానికర రసాయనాలు, అలాగే సంబంధిత అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.
సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన తొలి రోజే మిశ్రమ స్పందన రావడం, తరువాత ప్రతికూల సమీక్షలు రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మందగించాయి.
సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 16 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు కూడా కలెక్షన్లు పెరగకపోవడంతో సుమారు రూ. 25 లక్షల వరకు మాత్రమే ఆదాయం వచ్చింది. మొత్తం రెండు రోజుల్లో కలిపి రూ. 50 లక్షలకు కూడా చేరుకోకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇలాంటి ఫలితాలు నిర్మాతలకు నిరాశ కలిగించడమే కాకుండా, కాజల్ అగర్వాల్ కెరీర్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సినిమా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
also read: హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు… 25 టన్నులు స్వాధీనం
