HomeతెలంగాణJubli Hills By Polls Latest Update: కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి

Jubli Hills By Polls Latest Update: కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) కర్ణన్ తెలిపారు.

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్ స్టేడియంలో డీఆర్సీ సెంటర్‌లో రేపు శుక్రవారం (నవంబర్ 14, 2025) ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది అని తెలిపారు . మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేలుస్తాయి. ప్రత్యేక అనుమతితో 42 టేబుల్స్‌ను ఏర్పాటు చేసాం అన్నారు .

కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి చేస్తారు. లెక్కింపు విధులకు 186 మంది సిబ్బందిని కేటాయించం అన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసాము అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాము అన్నారు. సెక్షన్ 144 విధించారు అని తెలిపారు…

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు