Homeఆంధ్ర ప్రదేశ్జ‌న‌సేన ఏడు సిద్దాంతాల‌తో ప్ర‌జ‌ల్లో మ‌మేకం: డిప్యూటి సీఎం ప‌వ‌న్

జ‌న‌సేన ఏడు సిద్దాంతాల‌తో ప్ర‌జ‌ల్లో మ‌మేకం: డిప్యూటి సీఎం ప‌వ‌న్

  • పాడేరులో జనసేన ఆవిర్భావ వేడుకలు

  • థింసా నృత్యంతో స్వాగ‌తం

 

పాడేరు,క్రైమ్ మిర్ర‌ర్ః జ‌న‌సేన పార్టీ ఏడు సిద్దాంత‌ల‌తో ప్ర‌జ‌ల్లో మ‌మేక‌వ‌డం సంతోషానిస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, ఏపీ డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం రోడ్డు పనులు పరిశీలించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం పుర‌స్క‌రించుకొని ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా స్థానిక మ‌హిళ‌లు థింసా నృత్యంతో స్వ‌గ‌తం ప‌లికారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణి స్త్రీల‌కు పౌష్టికాహారం అందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈ సంద‌ర్భంగా పార్టీ ఆవిర్భావ శుభాంక్ష‌లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారుప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు సీఎం శుభాభినందనలు తెలిపారు. పవన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. జ‌న‌సేన పార్టీలో ప‌లువురు చేర‌గా వారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఆయ‌న వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంటు ఇంఛార్జి గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు

 

తాజావార్తలు