Homeఅంతర్జాతీయంభయాబెటిస్.. దేశంలో గణనీయంగా పెరుగుతున్న షుగర్ బాధితులు.!

భయాబెటిస్.. దేశంలో గణనీయంగా పెరుగుతున్న షుగర్ బాధితులు.!

Crime Mirror, Health Updates: డయాబెటిస్ క్యాపిటల్ గా భారత్ మారుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో సుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్యలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో డయాబెటిస్ సమస్య అధికంగా ఉంటుంది. తాజాగా వెళ్లడైన గణాంకాలు భారత్లో షుగర్ బాధితులు ఏ స్థాయిలో ఉన్నారన్న విషయాన్ని వెల్లడిస్తోంది.

తాజాగా జాతీయ కుటుంబ సర్వే – 6 ప్రకారం భారత్లో లక్షలాది మంది షుగర్ బాధితులు ఉన్నట్లు వెల్లడయింది. దీనికి ప్రధాన కారణం జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వృత్తిపరమైన ఒత్తిళ్లు వంటి అంశాలు కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గడచిన మూడు ఏళ్లలో రెండు నుంచి నాలుగు శాతం మేర మహిళలు, పురుషుల్లో డయాబెటిస్ సమస్య పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ఆందోళన కలిగిస్తున్న డయాబెటిస్ గణాంకాలు..

దేశంలో షుగర్ బాధితులు ఏ స్థాయిలో పెరిగితున్నారు అన్న విషయాన్ని తాజాగా ఆరోగ్య సర్వేకు సంబంధించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో 2019-21 మధ్యకాలంలో 13.5 శాతం మంది మహిళల్లో షుగర్ ఉంది. 2023-24 నాలుగు నాటికి మహిళల్లో డయాబెటిస్ సమస్య 17.8 శాతానికి పెరిగింది. అలాగే పురుషుల్లో ఈ సమస్య 15.6 శాతం నుంచి 20.9 శాతానికి పెరిగింది. 2023-24 ఏడాదికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను తాజాగా కేంద్రం వెల్లడించింది. ఇందులో ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అలాగే 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు గర్భ నిరోధక విధానాలు పాటించే వారి సంఖ్య 66.7 శాతం నుంచి 69.1 శాతానికి పెరిగింది. గర్భనిరోధానికి ఆధునిక పద్ధతులను వినియోగించేవారు సంఖ్య 56.4 శాతం నుంచి 52.7 శాతానికి తగ్గింది. సాంప్రదాయ విధానాలు పాటించే వారి సంఖ్య 10.3 శాతం నుంచి 16.4 శాతానికి పెరిగింది. అధిక స్థాయిలో మధుమేహం ఉన్నవారు లేదా మధుమేహ నియంత్రణకు మందులు వాడుతున్న మహిళలు 13.5 శాతం నుంచి 17.8 శాతానికి, పురుషులు 15.6 శాతం నుంచి 20.9 శాతానికి పెరిగారు.

దేశంలో గణనీయంగా తగ్గిన గృహహింస..

దేశంలో గృహింస కేసులు నమోదు సంఖ్య కూడా భారీగా తగ్గింది. 18 నుంచి 49 వేల మధ్య వివాహలో భాగస్వామి ద్వారా గృహహింసను ఎదుర్కొనే వారి సంఖ్య 29.2 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గింది. గర్భం దాల్చిన తర్వాత భౌతిక అహించకు లోనవుతున్న వారి సంఖ్య 3.1 శాతం నుంచి 2.7 శాతానికి తగ్గుముఖం పట్టింది. 18 నుంచి 29 ఏళ్లలోపు వయసున్న యువతుల్లో 18 ఏళ్ల నాటికి లైంగిక హింసకు గురయ్యే వారి సంఖ్య 1.2 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గింది. 15 ఏళ్ల పైబడిన మహిళల్లో పొగాకు ఉపయోగించేవారు 8.9 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గారు. 2019-21 కాలంతో పోలిస్తే 2023-24 నాటికి 18 ఏళ్లలోపే వివాహమైన యువతల సంఖ్య 23.3 శాతం నుంచి 20.1 శాతానికి తగ్గింది. 20వ కేల లోపు వివాహమైన యువకుల సంఖ్య 17.7 శాతం నుంచి 15.9 శాతానికి తగ్గుముఖం పట్టింది. అలాగే దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది.

గతంలో ఈ సంఖ్య 1.3 శాతం ఉండగా తాజాగా 1.1 శాతానికి తగ్గుముఖం పట్టింది. మద్యం తాగే మందు బాబుల సంఖ్య మాత్రం పెరిగింది. గతంలో 18.7 శాతం మంది పురుషులు మద్యం తాగితే తాజాగా ఈ సంఖ్య 18.9 శాతానికి పెరిగింది. ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3 శాతం నుంచి 64.3 శాతానికి పెరిగింది. ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3 శాతం నుంచి 64.3 శాతానికి భారీగా పెరిగింది. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు ఉన్న మహిళల సంఖ్య 78.6 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. సొంత ఫోన్ ఉన్న మహిళల సంఖ్య 53.9 శాతం నుంచి 63.6 శాతానికి చేరింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు