Homeఅంతర్జాతీయంశ్రీవాణి దాతలకు శుభవార్త చెప్పిన టిటిడి...!

శ్రీవాణి దాతలకు శుభవార్త చెప్పిన టిటిడి…!

  • శ్రీవాణి దాతలకు శుభవార్త చెప్పిన టిటిడి…!

  • విరాళాలు అందించే వారికి ప్రత్యేక టికెట్లు

Crime Mirror,Tirupathi: తిరుమల శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలు అందించే దాతలకు ప్రత్యేకంగా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఇకపై ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను కేటాయించేందుకు టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయాన్ని కొద్ది రోజుల్లోనే అమలు చేయడానికి కూడా సమాయత్తం అవుతోంది టీటీడీ. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని జూన్ 10వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రోజు 1500 శ్రీవాణి టికెట్లను టిటిడి కేటాయిస్తోంది. ఇందులో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద కేటాయిస్తున్నారు. మరో 200 వరకు టికెట్లను తిరుపతి ఎయిర్పోర్ట్లో కరెంటు బుకింగ్ కోటాలో జారీ చేస్తున్నారు.

రోజు ఆన్లైన్ కరెంటు బుకింగ్ కోటా ద్వారా ఉదయం తొమ్మిది గంటలకు 800 టికెట్లను జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలు అందించి దర్శన టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారు సుమారు 40 వేల మందికి ఉన్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది. వీరంతా ఎక్కువ రోజుల నుంచి నిరీక్షిస్తున్న నేపథ్యంలో వీరికి కూడా ప్రత్యేకంగా దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది.

ఈ ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేసేందుకు అనుగుణంగా నూతన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలోనే 800 టికెట్ల కోటాలో నుంచి 300 టికెట్లను కేటాయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని జూన్ 10వ తేదీ నుంచి ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ ప్రక్రియ 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని టిటిడి అధికారులు చెబుతున్నారు. దీనివల్ల శ్రీవాణి ట్రస్ట్ కు నిధులు అందించే దాతలకు మరింత సులభంగా స్వామివారి దర్శనాన్ని కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

వందలాదిమంది భక్తులకు మేలు..

తాజాగా టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల వందలాది మంది భక్తులకు మేలు చేకూరుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ కు ఎంతోమంది దాతలు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనాన్ని కల్పించడంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కువ రోజులు పాటు నిరీక్షించాల్సి రావడం వల్ల సమస్య ఏర్పడుతోందని భావించిన టిటిడి అధికారులు ఈ మేరకు ప్రత్యేక టికెట్లు దారికి ఏర్పాటు చేస్తున్నారు.

దీనివల్ల మరింతమంది స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించేందుకు ఎక్కువ మంది ముందుకు వచ్చేలా చేసేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమల రద్దీ అధికంగా ఉన్న క్రమంలో శుక్రవారం తోమాల సేవలోను దాదాపు 1500 మంది సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. తోమాల, అర్చన సేవా సమయాల్లో సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

శుక్రవారం అభిషేకం అనంతరం జరిగే తోమాల సేవ సమయం తక్కువగా ఉండే క్రమంలో సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతించే విధానాన్ని గతంలో రద్దు చేశారు. కానీ ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం తోమాల సేవలో 18 నిమిషాల వ్యవధిలో దాదాపు 1500 మంది భక్తులకు దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది భక్తులు వేగంగా స్వామివారిని దర్శించుకోగలిగారు. దీనిపట్ల భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు