Homeక్రైమ్ఒకరి తర్వాత ఒకరు.. మైనర్ బాలికపై అఘాయిత్యం

ఒకరి తర్వాత ఒకరు.. మైనర్ బాలికపై అఘాయిత్యం

క్రైం మిర్రర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికపై పలువురు వ్యక్తులు వరుసగా లైంగిక దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి తొలుత ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, ఆ విషయాన్ని ఆసరాగా చేసుకుని మరికొందరు కూడా వేర్వేరు రోజుల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రధాన నిందితుడు మారి రామకృష్ణ ప్రేమిస్తున్నానని నమ్మించి ఈ నెల 3న జాలే నవీన్, గణేష్ సహకారంతో ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అనంతరం ఈ విషయం తెలిసిన కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్ కూడా అవకాశాన్ని వినియోగించుకుని వేర్వేరు రోజుల్లో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

కొన్ని రోజుల పాటు తీవ్ర మానసిక వేదనకు గురైన బాలిక చివరకు ఈ నెల 11న జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలం, సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం మారి రామకృష్ణ, కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్, జాలే నవీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి మూడు ఆటోలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.

నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలికి అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

also read :అక్రమ సంబంధం కోసం భర్త హత్య.. భార్య, ప్రియుడు అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు