సోషల్ మీడియాలో ఇటీవల ఓ యువతి గుండు చేయించుకున్న వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. తల్లి కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకిస్తూ ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరగడంతో.. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. కుటుంబ ఒత్తిడికి ఎదురు నిలిచిన యువతిగా చాలామంది ఆమెను ప్రశంసించారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తాజాగా ఆ యువతి స్వయంగా వెల్లడించింది.
వైరల్‌గా మారిన ఆ వీడియోను రూపొందించిన కంటెంట్ క్రియేటర్ కీర్తన మీనన్ ఈ ఘటనపై స్పందించారు. తాను సరదాగా చేసిన ఓ పోస్టు అపార్థాలకు దారి తీసిందని తెలిపారు. తన వీడియోకు పెట్టిన “పీఓవీ: మా అమ్మ నా పెళ్లి ప్లాన్ చేసింది” అనే క్యాప్షన్‌ను నెటిజన్లు సీరియస్‌గా తీసుకోవడంతో అసలు విషయం పక్కదారి పట్టిందని చెప్పారు.
also read: మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం.. డిటర్జెంట్, రసాయనాలతో కోట్ల లీటర్ల సింథటిక్ పాలు!
ఈ రూమర్లపై స్పష్టత ఇచ్చేందుకు కీర్తన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. కోయంబత్తూరులోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో భక్తి కారణంగా మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే గుండు చేయించుకున్నానని తెలిపారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పెళ్లి విషయంలో కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి కూడా లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకుండా, వాస్తవాలను తెలుసుకోవాలని కీర్తన సూచించారు. కేవలం ఒక సరదా క్యాప్షన్ కారణంగా తన వ్యక్తిగత విషయంపై తప్పుడు ప్రచారం జరగడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
also read: బండ్ల గణేశ్ ఆస్తి వేలం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత