Homeట్రావెల్రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా గేర్ సెన్సార్ ఫిక్స్ చేయనున్న కంపెనీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్ యజమానులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా గేర్ సెన్సార్ ఫిక్స్ చేయనున్న కంపెనీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైక్ యజమానులకు కంపెనీ శుభవార్త చెప్పింది. కొన్ని మోడళ్లలో తాత్కాలికంగా అందుబాటులో లేని గేర్ పొజిషన్ సెన్సార్‌ను ఉచితంగా అమర్చనున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. అరుదైన ఖనిజాల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా కొన్ని 350 సీసీ మోడళ్లను గేర్ పొజిషన్ సెన్సార్ లేకుండానే కంపెనీ విక్రయించింది. అయితే ప్రస్తుతం అవసరమైన విడిభాగాలు అందుబాటులోకి రావడంతో, అర్హత ఉన్న బైక్‌లలో ఈ సెన్సార్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అమర్చనున్నట్లు వెల్లడించింది.

ఏ మోడళ్లకు వర్తిస్తుంది?

ఈ ఉచిత సదుపాయం కింద కొన్ని యూనిట్లకు చెందిన ఈ మోడళ్లు ఉన్నాయి:

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
  • గోవాన్ క్లాసిక్ 350
  • మీటియోర్ 350
  • హంటర్ 350

ఈ బైక్‌లలో కొన్ని యూనిట్లకు గతంలో గేర్ పొజిషన్ సెన్సార్ స్థానంలో న్యూట్రల్ ఇండికేషన్ సిస్టమ్‌ను తాత్కాలికంగా ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.

బైక్ పనితీరుకు ఎలాంటి సమస్య లేదు

గేర్ పొజిషన్ సెన్సార్ లేకపోవడం వల్ల వాహనం పనితీరు లేదా భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండదని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమేనని పేర్కొంది.

ఉచితంగా ఎలా అమర్చుకోవాలి?

మీ బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్ లేకపోతే సమీపంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. వాహన ఛాసిస్ నంబర్ లేదా వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) ఆధారంగా మీ బైక్ ఈ సదుపాయానికి అర్హత ఉందో లేదో సిబ్బంది చెక్ చేస్తారు. అర్హత ఉన్న వాహనాలకు సెన్సార్‌ను ఉచితంగా అమర్చనున్నారు. ఇందుకోసం విడిభాగాల ఖర్చు లేదా సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.
అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక యాప్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ అప్‌డేట్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది.

also read: Amaravati Assigned Lands Case: సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టు భారీ ఊరట.. CID కేసు రద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు