Homeసినిమాబండ్ల గణేశ్ ఆస్తి వేలం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత

బండ్ల గణేశ్ ఆస్తి వేలం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆస్తి వేలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన ఆస్తుల వేలం విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు సంబంధించి ఈ వివాదం మొదలైంది. రుణాలకు భద్రతగా బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టారు. ఆ తర్వాత సంస్థ రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో, దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బ్యాంక్ తనఖా పెట్టిన ఆస్తులను SARFAESI చట్టం కింద వేలం వేసింది.

also read: Navi Mumbai Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసీ…11 నెలల తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు

అయితే ఈ వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ బండ్ల గణేశ్.. డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ (DRT-II)ను ఆశ్రయించారు. విచారణ అనంతరం డీఆర్టీ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేలం ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, ఆస్తులను తిరిగి యజమానులకు అప్పగించాలని, వేలంలో ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డీఆర్టీ ఆదేశించింది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు డీఆర్టీ ఆదేశాలను రద్దు చేస్తూ బ్యాంక్ చర్యలను సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

also read: మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం.. డిటర్జెంట్, రసాయనాలతో కోట్ల లీటర్ల సింథటిక్ పాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు