Homeతెలంగాణవేసవిలో మెరిసే చర్మం కోసం ఐస్ మసాజ్.. ఎలా చేసుకోవాలంటే...!

వేసవిలో మెరిసే చర్మం కోసం ఐస్ మసాజ్.. ఎలా చేసుకోవాలంటే…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: వేసవి కాలంలో ఎండల ప్రభావంతో చర్మం నిర్జీవంగా మారడం, ముఖంపై వాపు, దద్దుర్లు, అలసట వంటి సమస్యలు రావడం సాధారణమే. అయితే ఇంట్లోనే సులభంగా చేయగలిగే ఒక చిన్న బ్యూటీ టిప్‌తో ఈ సమస్యలకు కొంతవరకు చెక్ పెట్టొచ్చు. అదే ఐస్ మసాజ్. ముఖంపై ఐస్ క్యూబ్స్‌తో మెల్లగా మసాజ్ చేయడం వల్ల చర్మానికి చల్లదనం అందడమే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ముఖంపై వాపు తగ్గుతుంది…

ఉదయం నిద్రలేవగానే చాలామందికి ముఖం, ముఖ్యంగా కళ్ల కింద వాపుగా కనిపిస్తుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుని వాపు తగ్గుతుంది. దీంతో ముఖం తాజాగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

ముడతలకు చెక్…

క్రమం తప్పకుండా ఐస్ మసాజ్ చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచి ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

సహజమైన గ్లో వస్తుంది…

ఐస్ మసాజ్ వల్ల ముఖంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మానికి అవసరమైన ఆక్సిజన్ సరిగ్గా అందడంతో ముఖం సహజమైన కాంతితో మెరిసిపోతుంది.

మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది…

మేకప్ వేసుకునే ముందు ఐస్ మసాజ్ చేస్తే చర్మ రంధ్రాలు చిన్నవిగా మారతాయి. దీంతో మేకప్ స్మూత్‌గా సెటై ఎక్కువసేపు చెదరకుండా ఉంటుంది.

వేసవి వేడి నుంచి ఉపశమనం…

ఎండల్లో తిరిగిన తర్వాత ముఖంపై ఐస్ మసాజ్ చేస్తే చర్మానికి చల్లదనం లభిస్తుంది. సన్ హీట్ వల్ల కలిగే మంట, అలసట కొంతవరకు తగ్గుతుంది.

ఐస్ మసాజ్ ఎలా చేయాలి…?

ఐస్ క్యూబ్స్‌ను నేరుగా ముఖంపై రుద్దకండి. శుభ్రమైన గుడ్డలో చుట్టి మెల్లగా సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి. రోజుకు 2 నుంచి 3 నిమిషాలకంటే ఎక్కువ చేయకూడదు. సెన్సిటివ్ స్కిన్ లేదా సైనస్ సమస్యలు ఉన్నవారు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గమనిక: ఐస్ మసాజ్ చర్మానికి తాత్కాలిక ఫ్రెష్‌నెస్, గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది. అయితే తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు