Homeసినిమాఒకప్పుడు హీరో భార్యకు నచ్చలేదని నన్ను సినిమా నుంచి తొలగించారు- తాప్సీ

ఒకప్పుడు హీరో భార్యకు నచ్చలేదని నన్ను సినిమా నుంచి తొలగించారు- తాప్సీ

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ.. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టారు. సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగత కారణాలతో తనను ప్రాజెక్టుల నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. నయన్‌దీప్ రక్షిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ ఈ విషయాలను పంచుకున్నారు.

తాను ఓ సినిమాలో నటించేందుకు ఒప్పుకుని, సంతకం చేసిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారని తాప్సీ తెలిపారు. ఇందుకు కారణం అడిగినప్పుడు చెప్పిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సదరు హీరో భార్యకు తాను నచ్చలేదని చెప్పి తనను సినిమా నుంచి తప్పించారని ఆమె గుర్తుచేసుకున్నారు.

అయితే తనపై ఆమెకు ఎందుకు అసంతృప్తి ఉందో ఇప్పటికీ తనకు తెలియదని తాప్సీ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన హీరో, ఆయన భార్య పేర్లను మాత్రం ఆమె వెల్లడించలేదు.

మరో సందర్భంలోనూ ఇలాంటి అనుభవమే ఎదురైందని తాప్సీ చెప్పారు. ఓ ప్రముఖ హీరోకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో నటిని సినిమాలో తీసుకోవాలనే ఉద్దేశంతో తనను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు తెలిపారు.

ఇక సినీ పరిశ్రమలో నటీనటులను ఒకే తరహా పాత్రలకే పరిమితం చేసే టైప్‌కాస్టింగ్‌పై కూడా తాప్సీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొంతమంది నటీమణులను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తే.. మరికొందరిని సీరియస్ లేదా బలమైన పాత్రలకే ఎంపిక చేస్తుంటారని ఆమె అన్నారు.

తన విషయంలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నానని తాప్సీ తెలిపారు. తనకు ఒకే రకమైన ఇమేజ్ వచ్చేలా చేసే పాత్రలను అవసరమైతే తిరస్కరిస్తున్నానని చెప్పారు. విభిన్నమైన కథలు, పాత్రలు చేయడం ద్వారా నటిగా తన పరిధిని విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

ఇటీవల ‘అస్సి’, ‘గాంధారి’ వంటి చిత్రాల్లో నటించి తాప్సీ ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో నటీమణులు ఎదుర్కొనే పరిస్థితులపై మరోసారి చర్చకు దారితీశాయి.

also read: అర్ధరాత్రి 3 గంటల వరకు భారీ శబ్దాలు.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు