హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ సినిమా ప్రస్తుతం సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో “ఐ యామ్ గేమ్”నే అత్యంత స్టైలిష్ మూవీ అని తెలిపారు. సినిమాలో తన పాత్ర మాత్రమే కాకుండా మొత్తం విజువల్ వరల్డ్‌ను కూడా చాలా మోడర్న్, క్లాస్‌గా డిజైన్ చేశారని చెప్పారు.
దర్శకుడు Nahas Hidayath ప్రత్యేకంగా తనను కొత్త స్టైలిష్ అవతార్‌లో చూపించాలని భావించారని, అదే ఈ సినిమాకు ప్రధాన హైలెట్‌గా మారిందని దుల్కర్ వెల్లడించారు. ‘ఆర్‌డీఎక్స్’ తర్వాత నహాస్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.
2026 ఆగస్టులో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రం కావడం విశేషం. అలాగే ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలవనుంది.
ఈ చిత్రాన్ని వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. కథను షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ అందించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఇటీవల వరుసగా వింటేజ్ లుక్స్‌లో కనిపించిన దుల్కర్, ఈసారి పూర్తిగా స్టైలిష్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. సంగీతాన్ని జాక్స్ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ స్టంట్ డ్యుయో అన్బరివ్ రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.